ఐశ్వర్య రాజేష్ తండ్రి కూడా పెద్ద హీరో అని తెలుసా… ఆయన నటించిన సినిమాలు ఇవే…!!

ఐశ్వర్య రాజేష్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అభినయం, నటన ప్రతిభతో సౌత్ సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తుంది. తమిళ్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీనే ఇస్తుంది. అందం విషయాన్ని పక్కన పెడితే అభినయం విషయంలో మాత్రం ఫస్ట్ స్థానాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక కౌసల్య కృష్ణమూర్తి, టక్ జగదీష్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి తెలుగు సినిమాలలో కూడా ఐశ్వర్య రాజేష్ నటించిన. ఇక ఈ సినిమాలతోనే బాగా పాపులర్ కూడా అయ్యింది. చాలామంది ఈమెకి ఎటువంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేదు అని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. ఈమె తండ్రి రాజేష్ కూడా అనేక సినిమాలలో హీరోగా నటించాడు. ఈయనకి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఐశ్వర్య తండ్రి రాజేష్ నటించిన..” నెలవంక ” సినిమా అప్పట్లో తెలుగు ప్రేక్షకులని ఓ ఊపు ఊపింది.

అనంతరం ఆయనకి వరుస అవకాశాలు వచ్చాయి.. కానీ ఈ సినిమా ఇచ్చినంత సక్సెస్ మరి ఏ సినిమా ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేకపోయారు. ఇక ఐశ్వర్య చిన్నతనంలో రాజేంద్రప్రసాద్ రామబంటు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది. తర్వాత 2010 వరకు సినిమాలు చేయలేదు. ప్రస్తుతం ఈమె కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినిమా రంగంలో దూసుకుపోతుంది.