టాలీవుడ్ స్టార్ బ్యూటీ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమర్షియల్ కథలను ఎంచుకోకుండా తన క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే కదలని ఎంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎటువంటి స్టార్ హీరో సినిమాల్లో అవకాశం వచ్చిన ఆమె రోల్ నచ్చకపోతే టక్కున నో చెప్పేసే ఈ బ్యూటీ గ్లామర్ పాత్రలకు ఎప్పుడు దూరంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం సాయి పల్లవి పలు సినిమా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో రామ్ చరణ్ – బుచ్చిబాబు సనా కాంబోలో రాబోతున్న మూవీకి కూడా సాయి పల్లవి హీరోయిన్ గా ఓకే చెప్పినట్లు న్యూస్ వైరల్ అవుతుంది.
దాదాపు కమర్షియల్ సినిమాలకు మొహమాటం లేకుండా నో చెప్పే సాయి పల్లవి.. ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ మూవీలో కచ్చితంగా తన క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉండి ఉంటుందని.. కథలో కంటెంట్ ఉంటుంది అందుకే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ టాక్ వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ జరుగుతుంది. ఇక ఎలాగైనా వచ్చే సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఈ సినిమా తరువాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో రామ్ చరణ్ మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో మొదట మృణాల్ ఠాగూర్, తర్వాత జాన్వి కపూర్ ను హీరోయిన్ గా తీసుకున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం సాయి పల్లవి ఈ సినిమాల్లో హీరోయిన్ గా సెలెక్ట్ అయిందంటూ ఆమెకు కూడా కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ న్యూస్ వినిపిస్తుంది.
బుచ్చిబాబు ఈ సినిమా రూరల్ స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సాయి పల్లవికి అయితే ఈ క్యారెక్టర్ బాగా సెట్ అవుతుందని భావించాడట. దీంతో ఈ సినిమా కథను సాయి పల్లవికి వినిపించాగా కథ నచ్చి సాయి పల్లవి అగ్రిమెంట్ పై సైన్ కూడా చేసిందంటూ తెలుస్తుంది. అయితే రామ్ చరణ్ – సాయి పల్లవి కాంబో అంటేనే క్రేజీ కాంబినేషన్. ఇలాంటి క్రేజీ కాంబినేషన్ తెరపైకి వస్తే ఏ రేంజ్ లో రిజల్ట్ ఉంటుందో అనే ఆసక్తి ప్రస్తుతం ప్రేక్షకుల్లో నెలకొంది.