సాయంత్రం అవుతుందంటే చాలు ముందుగా గుర్తుకొచ్చేది పానీ పూరి. రోడ్ సైడ్స్ ఈ బండులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్లు ఈ పానీపూరిని ఎంజాయ్ చేస్తూ తింటారు. అయితే తినే ముందు మీరు దీని గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. పానీపూరి లో ఉపయోగించే పానీ మంచిగా లేకపోతే.. మీరు ఆసుపత్రికి వెళ్ళవచ్చు.
కలుషితమైన నీటి ద్వారా టైఫాయిడ్ లాంటి అనేక వ్యాధులు వస్తాయని విషయం తెలిసిందే. అంతేకాకుండా.. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా మెదడులోకి బద్దెపురుగు లాంటి చిన్న చిన్న పురుగులు చేరే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు సైతం హెచ్చరిస్తున్నారు.
డాక్టర్ మిరియాల శ్రీకాంత్ ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేసిన విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ” ఓ పాప స్కానింగ్లో బయటపడిన షాకింగ్ విషయాలు తెలిసాయి. ఇది చదివిన తర్వాత కూడా మీకు పానీపూరి తినాలనిపిస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని తినండి. ముఖ్యంగా మీ పిల్లలు పానీ పూరి కావాలని ఏడుస్తుంటే.. ఒకసారి ఈ స్టోరీ చూడండి ” అంటూ ఓ పోస్ట్ ని షేర్ చేశారు.
పానీ పూరీ.
డాక్టర్ గారూ, మా పాప స్కాన్ చూశారా!
ఆ చూశాను, కంగారు లేదు, ఒకటే ఉంది.
ఏంటండీ అదీ?
బద్దె పురుగు పిల్ల!
అమ్మో ఏంటండీ అదీ? ఎక్కడుందీ?
ఏం పర్లేదు, ఈపాటికి అది చనిపోయుంటుంది, కానీ మెదడులో ఉంది అదే సమస్య. అందువల్లే ఫిట్సు వచ్చింది మీ పాపకి.
అయ్యో, చిట్టి తల్లి,… pic.twitter.com/1C7N8PISuO
— Srikanth Miryala (@miryalasrikanth) November 15, 2023