బాలయ్య పై అలాంటి కామెంట్స్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్..!!

టాలీవుడ్ లో అడపాదప సినిమాలలో నటించిన హీరోయిన్స్ లో హీరోయిన్ పాయల్ ఘోష్ కూడా ఒకరు.. ఊసరవెల్లి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఈ అమ్మడు మంచి పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో అడపా దడపా సినిమాలలో నటించినప్పటికీ ఎప్పుడు వివాదాలలో నిలుస్తూనే ఉంటుంది. ఇక బాలయ్య కూడా ఇటీవలే భగవంత్ కేసరి అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు వరుసగా 100 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన చిత్రాలను ఈ వయసులో కూడా బాలయ్య స్టామినా ఏంటో చూపించారు.

తాజాగా పాయల్ ఘోష్ బాలయ్య పైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ బాలకృష్ణ సార్ ఈ వయసులో కూడా సూపర్ హిట్ ఇస్తున్నారు. బాలీవుడ్ నటనను చూసి బాలివుడ్ యాక్టర్స్ నేర్చుకోవాలని తెలియజేసింది. ప్రస్తుతం పాయల్ గోష్ షేర్ చేసిన ఈ ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనకు ఎదురైన అవమానాల పైన ఈమె చేసిన కామెంట్లు అప్పట్లో చాలా దుమారాన్ని రేపాయి.

RRR సినిమా సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పైన స్పందించడం జరిగింది. ఎలాంటి పాత్రలోనైనా సరే అవలీలగా నటించే ఎన్టీఆర్కు ఆస్కార్ కచ్చితంగా వస్తుందని తెలిపింది. హిందీ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న పాయల్ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ను ఇప్పుడు బాలకృష్ణను ప్రశంసిస్తూ మాట్లాడడం పై అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నారు. బాలకృష్ణ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.