డయాబెటిస్ ఉన్నవారు ఉల్లిపాయలు తింటే ఏమవుతుందో తెలుసా..?

ప్రస్తుతం ఉన్న కాలంలో డయాబెటిస్ తో చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. జీవితకాలం పాటు మందులు ఉపయోగిస్తూ చాలా జాగ్రత్తలు తీసుకోవలసి వస్తోంది. డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు వ్యవహరించాల్సి ఉంటుంది.. అందుకే ప్రతిరోజు మనం వండే వంటలలో కూడా ఉల్లిపాయలు వేస్తూ ఉంటాము.. ఉల్లిపాయల కూర రుచికి చక్కగా అందించినప్పటికీ ఉల్లిపాయను డయాబెటిస్ రోగులు తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.


డయాబెటిస్ వ్యాధిని నియంత్రణంగా ఉంచడానికి ఉల్లిపాయలు చాలా సహాయపడతాయట. ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే చాలామందికి డయాబెటిస్ వచ్చేస్తోంది. ఈ డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే చాలు జీవితాంతం మందులు వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఒక చిన్న ఉల్లిపాయ ముక్కని డయాబెటిస్ రోగులుతున్నట్లు అయితే ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను సైతం నియంత్రించడానికి సహాయపడతాయట. ముఖ్యంగా ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుందట.

ఫైబర్ విచ్చిన్నమై జీర్ణం అయ్యేటప్పుడు రక్తంలోని చక్కెర స్థాయిలను విడుదల చేయడం ఆలస్యం అయ్యేలా ఉల్లిపాయ కంట్రోల్ చేస్తుంది. డయాబెటిస్ ఉండేవారు మలబద్ధక సమస్యను కూడా తగ్గిస్తుంది.డయాబెటిస్ వల్ల వచ్చే అధిక బరువు చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలను కూడా తగ్గించడానికి ఉల్లి చాలా సహాయపడుతుందట. అందుకే ఉల్లిని తినడానికి డయాబెటిస్ రోగులు ప్రయత్నించడం మంచిది.

ఎన్నో రకాల పద్ధతిలో ఉల్లిని సైతం తీసుకోవడం వల్ల అందులో ఉండే పోషకాలు కూడా శరీరానికి బాగా ఉపయోగపడతాయి.. ఉల్లి కోసేటప్పుడు కూడా కంటిలో నుంచి నీరు వచ్చిన కంటిలో ఉండే దుమ్ము ధూళి వంటి వాటిని కూడా శుభ్రం చేసేందుకు సహాయపడుతుంది.