ఆమెలో ఏదో మ్యాజిక్ ఉంది.. హీరోయిన్ పై నాని పొగ‌డ్త‌ల వ‌ర్షం..

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం హాయ్ నాన్న మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది దసరా సినిమా ద్వారా భారి బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న నాని.. తాజాగా హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో భాగంగా గ్రాండ్ లెవెల్లో మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని హీరోయిన్ మృణాల్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. తనకు ఇతర సినిమా అవకాశాలు వచ్చిన కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ నేపథ్యంలో ఫాద‌ర్ డాట‌ర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తరువాత నాని ఆమె నటన పట్ల చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నాని మాట్లాడుతూ మృణాల్‌లో ఏదో తెలియని ఎక్సైటింగ్ పాయింట్ ఉంది.. స్క్రీన్ మీద తన మ్యాజిక్ చేస్తుంది.. కెమెరా వెనుక ఎలా ఉన్నా కెమెరా ముందు మాత్రం న‌ట‌న‌తో రెచ్చిపోతుంది అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ కూడా ఉన్నాయనే సంగతి తాజాగా రిలీజ్ అయిన టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ సీన్స్ పై నాని స్పందిస్తూ సినిమాకు అది అవసరం కాబట్టే పెట్టామని కామెంట్ చేశాడు. ఇక దసరా సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న నాని ఈ మూవీతో ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో..? లేదో..? చూడాలి.