వరుణ్, లావణ్య‌ మెహందీ వేడుకలో అందాల భామల ర‌చ్చ‌… ఫొటోలు..!

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న ( అక్టోబర్ 31న‌ ) హల్దీ కారణాలు పూర్తి చేసుకోగా.. తాజాగా మెహందీ సెలబ్రేషన్స్ షురూ చేశారు. ఇందులో మెగా ఫ్యామిలీ అంతా సందడి చేసింది. చిరు, పవన్ కళ్యాణ్, నాగబాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుప్రీం సందడి అంతా ఇంతా కాదు.

ఇక వీరితో పాటు మెగా ఫ్యామిలీ లో ఉన్న పిల్లలు సైతం సందడి చేశారు. లేడీస్ చేతులకు మెరిసిపోయే మెహందీ తో ఫోటోలకు ఫోజులిచ్చారు. ముఖ్యంగా లావణ్య చేతుల నిండా మెహందీ పెట్టుకుని… ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. మెహందీ ఈవెంట్ తో పాటు మ్యూజిక్ ఈవెంట్ ని కూడా.. మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ ఎంజాయ్ చేశారు.

ప్రస్తుతం వీరి మెహందీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ చూసిన ప్రేక్షకులు..” లావణ్య కంటే తన పక్కనున్న అందాల భామలు తెగ మెరిసిపోతున్నారు. వీళ్లకు లైటింగ్ కూడా అక్కర్లేదు. ఏరా ద్యం అప్సరసలో..” అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇక ఈరోజు మధ్యాహ్నం 2:48 గంటలకు వీరిద్దరూ ఒకటి అయ్యారు.