అడ్డంగా దొరికిపోయిన రతిక… మోకాళ్ళపై కూర్చుని క్షమించమని అడిగిన అమర్…!

బిగ్ బాస్ లో మిగతా రోజుల సంగతి ఎలా ఉన్నా నామినేషన్స్ మాత్రం హోరాహోరీగా జరుగుతాయి. కంటెస్టెంట్స్ అందరూ అరవడం, అసలు పాయింట్లు మాట్లాడడం, అసలు గుట్టు బయట పెట్టడం లాంటివి చేస్తారు. ఈ క్రమంలోనే రతిక నిజ స్వరూపం బయటపడింది.

రతిక… శోభ మధ్య గొడవ గట్టిగానే జరిగింది. శోభ తో మాట్లాడుతూ తేజ పేరు తీసుకొచ్చింది. దీంతో తేజ ముందుకొచ్చి..” నా పేరు ఎందుకు మధ్యలో తీసుకొచ్చావ్ ” అని రతికాని అడిగాడు. దాంతో రతిక నోరు మూసుకుంది. అనంతరం అమర్…భోలె ని నామినేట్ చేస్తూ… ఏం పీకావ్ అనే పదం వాడాడు. దానికి మోకాళ్లపై కూర్చుని క్షమాపణ సైతం చెప్పాడు.

రతిక తో మాట్లాడిన శోభ…” నువ్వు అమర్ కి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదని నన్ను అన్నావు కథ… మరి నువ్వు కూడా సపోర్ట్ చేశావుగా అందుకే నిన్ను నేను నామినేట్ చేస్తున్నాను ” అంటూ రివేంజ్ నామినేషన్ వేసింది శోభ. ఇది చూసిన ప్రేక్షకులు…” రతిక బుద్ధి ఇంకా మారలేదు. అది ఈ జన్మకు మారదు …” అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.