రష్మిక‌ని ఎయిర్‌పోర్టులో అలా చేశారా… ఆఖరికి ఇక్కడ కూడా విడిచి పెట్టలేదా…!

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో సైతం దూసుకుపోతుంది. రణ‌బీర్ తో కలిసి నటించిన..” యానిమల్ ” మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. సాధారణంగా ఏ సెలబ్రిటీ అయినా ఎయిర్‌పోర్ట్‌లో కనిపిస్తే.. ఫోటోలు, హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది.

తాజాగా రష్మిక కు కూడా ఓ ఊహించని అనుభవం ఎదురయింది. ఈమె ఎయిర్‌పోర్ట్‌లో కనిపించగానే ఒక చిన్నారి అభిమాని వచ్చి.. ఆమె చేతిని పట్టుకుంది. అక్కడితో ఆగిపోకుండా రష్మిక బుగ్గలని గిల్లుతూ ముద్దు పెట్టుకుంది. దీంతో ఈ బ్యూటీ కళ్ళు మూసుకుని సిగ్గు పడింది. అనంతరం వారికి ఆటోగ్రాఫ్ ఇవ్వడమే కాకుండా వారితో పలు ఫోటోలు సైతం దిగింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు…” రష్మిక అంటే ఆ మాత్రం ఉంటుంది. ఆ అందానికి.. ఆ ఫేస్ కట్ కి మనం ఇచ్చే వ్యాల్యూ ఎంతండీ.. ఆ అభిమాని కేవలం చేతుతోనే ముద్దు పెట్టుకుంది. మేమైతే డైరెక్ట్ గా పెట్టేవాళ్ళు. ఏదేమైనా ఈమెని ఎయిర్పోర్ట్లో కూడా వదలడం లేదు ” అంటూ కామెంట్లు చేశారు.