సుశాంత్ సింగ్ తో బ్రేకప్ పై స్పందించిన హీరోయిన్ అంకితా..!!

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే కొన్ని కారణాలు చేత మరణించడంతో ఇప్పటికీ ఈ హీరో డెత్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో సూసైడ్ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. సుశాంత్ ఆత్మహత్య తర్వాత అతని ప్రియురాలు రియా చక్రవర్తి చాలా ఆరోపణలు ఎదుర్కొన్నది.

అయితే కొన్ని నెలలపాటు జైలు జీవితాన్ని అనుభవించిన రియా చక్రవర్తి కంటే ముందు సుశాంత్ ప్రేమించిన అమ్మాయి అంకితా లోకండే.. బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన ఈమె ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొని మొదటిసారిగా సుశాంత్ తో బ్రేకప్ గురించి తెలియజేయడం జరిగింది.. ఈమె మాట్లాడుతూ అతడిని తాను ఎంతగానో ప్రేమించాలని ఎదుటి వాళ్ళ మాటలు విని తన నుంచి తను దూరంగా విడిపోయాడని చెప్పడం జరిగింది..

తన జీవితం నుంచి సుశాంత్ అకస్మాత్తుగా విడిపోవడం జరిగింది.. కానీ తను ఎందుకు బ్రేకప్ చెప్పాడు అనే విషయం తనకి ఇప్పటికీ తెలియదని.. అందుకు రీజన్ అడగాలని ఎప్పుడూ అనుకోలేదని సుశాంత్ బ్రేకప్ తర్వాత నేను మరొకరిని ప్రేమించలేకపోయానని ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా ఏళ్లు పట్టిందని తెలిపింది.. విజయాలు నిచ్చని ఎక్కుతున్న సమయంలో చాలామంది కిందికి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మా ఇద్దరి మధ్య అప్పుడు ఏం జరిగిందో తెలియదు.. కానీ అతడిని ఆపడానికి నేను అసలు ప్రయత్నించలేదు తన నిర్ణయాన్ని మాత్రమే గౌరవించానని తెలిపింది అంకిత. 2016లో ఇద్దరు విడిపోయామని తెలిపింది.