అతను ఒక బుద్ధి లేనోడు అంటూ ఆర్ఎక్స్100 డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

దర్శకుడు అజయ్ భూపతి తీసిన తెలుగు చిత్రం, “మంగళవారం” శుక్రవారం రోజు విడుదల అయ్యింది. ఇది 1980లు, 1990ల కాలానికి చెందిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ స్టోరీ, యాక్టర్స్ టాప్ నాచ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది, ముఖ్యంగా టాలీవుడ్‌కి విజయవంతమైన పునరాగమనం చేసిన పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రం ఇతర భాషల్లో కూడా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

అయితే, ఈ మూవీ ని మెచ్చుకున్న వాళ్లతో పాటు విమర్శించిన వారు కూడా ఉన్నారు. అంతేకాదు సినిమా గురించి కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఈ చిత్రం విడుదలకు ముందు, అజయ్ భూపతి ఈ చిత్రంలో బ్రాస్ మస్క్ ధరించిన వ్యక్తి మేజర్ ట్విస్ట్స్, ఐడెంటిటీ వంటి ఎటువంటి స్పాయిలర్లను బయట పెట్టవద్దని రివ్యూయర్స్‌ను అభ్యర్థించారు. ముందుగా ఏమీ తెలుసుకోకుండా ప్రేక్షకులు సినిమాను మంచి ట్విస్టులతో చూడాలని కోరాడు. కానీ ఒక రివ్యూయర్ డైరెక్టర్ చేసిన రిక్వెస్ట్ ను లెక్క చేయలేదు. సినిమాలోని కీలక ట్విస్ట్స్‌ వెల్లడించి మొత్తం ఎక్స్‌పీరియన్స్ పాడు చేశాడు, దర్శకుడికి కోపం తెప్పించాడు.

సినిమా సక్సెస్ మీట్‌లో అజయ్ భూపతి ఎథికల్ సినిమా రివ్యూయింగ్ ప్రాముఖ్యత గురించి మాట్లాడాడు. తన అభ్యర్థనను గౌరవించి, సినిమా ఎక్స్‌పీరియన్స్ నాశనం చేయకుండా ఫీడ్ బ్యాక్ అందించిన మెజారిటీ సమీక్షకులకు అతను కృతజ్ఞతలు తెలిపాడు. అయితే సినిమా కీలక అంశాలను ఉద్దేశపూర్వకంగా బయటపెట్టిన ఒక రివ్యూయర్‌ని కూడా ఆయన విమర్శించారు.

“సినిమాపైగానీ, ప్రేక్షకులపైగానీ ఏమాత్రం గౌరవం చూపలేదు. మొత్తం కథను రికార్డు చేసి బయటపెట్టాడు. సినిమాలోని థ్రిల్‌, సస్పెన్స్‌ని దూరం చేశాడు. మంచి రివ్యూయర్‌ ఆశ్చర్యాలను చెడగొట్టకుండా నిజాయితీగా సినిమాను రివ్యూ చేయాలి.” అని భూపతి అన్నారు. సెన్స్‌లెస్ అని కూడా రివ్యూయర్ ని తిట్టాడు.