మ‌హేష్‌, ప‌వ‌న్ ల‌లో మీ ఫ‌స్ట్ ఛాయిస్ ఎవ‌రు.. అదిరిపోయే ఆన్స‌ర్ ఇచ్చిన‌ శ్రీ‌లీల‌..

ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్‌ బ్యూటీ అనగానే ట‌క్కున గుర్తుకు వచ్చేది శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ వారుస‌ సినిమా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది. ఇటీవల బాలకృష్ణ భగవంత్‌ కేసరి సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ప్రస్తుతం మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోగా శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఆదికేశవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకి వస్తోంది. అయితే ఈ సినిమా తన కెరీర్ స్టార్టింగ్ లో ఒప్పుకున్న సినిమా అయినప్పటికీ ఇప్పటివరకు వరుస వాయిదాలు పడుతూ వచ్చింది.

ఈ మూవీ ఇప్పటికీ ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్స్ జోరుగా సాగుతున్నాయి. వైష్ణవ తేజ్, శ్రీ లీల వరుసగా ఇంటర్వ్యూలో పాల్గొంటూ మూవీ పై హైప్ పెంచుతున్నారు. ఇక ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీలకు సంగీత్ శోభన్ ఓ ఆసక్తికర ప్రశ్నను సంధించాడు. మహేష్, పవన్ వీరిద్దరిలో మీ ఫస్ట్ ఛాయిస్ ఎవరు అని ఈ యంగ్ హీరో ప్రశ్నించాడు. అయితే శ్రీ లీలా ప్రస్తుతం గుంటూరు కారంతో మహేష్ బాబు సినిమాలో, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక సంతోష శోభన్ అడిగిన ప్రశ్నకు శ్రీ లీల ఏమాత్రం సంబంధం లేనట్లుగా ఆన్సర్ చెప్పింది. ఆ ప్రశ్నను దాటేస్తూ ఆదికేశవ మూవీ నవంబర్ 24 న రిలీజ్ కాబోతుంది. చాలా బాగుంటుంది అంటూ అస‌లైన సమాధానం చెప్పకుండానే తప్పించుకుంది. ఈ వీడియో ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్ అవ్వడంతో నాన్ సింక్‌లో ప్రశ్న వచ్చిన మంచి సింక్లో సమాధానమిచ్చావు శ్రీ లీల అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ఇక శ్రీలీల ఇటీవల ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన త‌న అందం, డ్యాన్స్‌తో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.