చ‌లికాలంలో మెంతికూర తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా.. త‌ప్ప‌క తెలుసుకోండి..?

చలికాలంలో రోగాల బారిన పడకుండా ఎన్నో రకాల ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. అయితే అలా ఆకుకూరల్లో మెంతికూర తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో రకాల ఆహార ప్రయోజనాలను ఉన్నాయ‌ని వైద్యులు చెప్తున్నారు. మెంతికూరతో ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా మెంతికూర సహాయపడుతుంది. ఇందులో పోషకాహారం పుష్కలంగా ఉంటుంది. మెంతికూర ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది బంగాళదుంప మెంతికూర ఎక్కువగా ఇష్టపడతారు. ఎన్నో రోగాల నుంచి కాపాడుతుందని వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో మెంతికూరను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఒకసారి చూద్దాం.

మెంతికూర ఎన్నో రకాల ఔషధ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ చేసేందుకు సహకరిస్తాయి. డయాబెటిస్ పేషంట్లకు వారి డైట్ లో మెంతికూర చేర్చడం ఎంతో మంచిది. బరువు తగ్గడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గడానికి కూడా ఈ చిన్ని ఆకులు కీలక పాత్రను పోషిస్తాయి. మెంతికూర మన డైట్ లో చేర్చుకోవడం వల్ల మెటబాలిజం పెరిగి బరువు సులువుగా తగ్గొచ్చు. ఇక‌ ఇటీవల కాలంలో ఆహారపు అల‌వాట్ల‌తో జీర్ణ సమస్యలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో మెంతికూరాలని తింటే జీర్ణ వ్యవస్థల ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.

అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలకు మెంతికూర చెక్‌ పెడుతుంది. మెంతికూరలో ఉండే విటమిన్స్, మినరల్స్ మన ఇమ్యూనిటీని పెంచి రోగాలను మన దరి చేరకుండా కాపాడుతుంది. దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ లాంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికి మెంతి ఆకులు అద్భుతమైన ఔషధంలా పనిచేస్తాయి. మెంతికూర తినడం వల్ల గుండె జబ్బులకు సంభవించే ప్రమాదం తగ్గుతుంది. విటమిన్ సి, ఫ్లావనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ ఈ ఆకుకూరలో పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టడంలో సహకరిస్తాయి. మెంతికూరలో ఉండే కాల్షియం ఎముకలు దృఢత్వానికి, మెగ్నీషియం శరీరాన్ని హెల్తీగా ఉంచడానికి జ‌హ‌క‌రిస్తాయి.