పుష్ప2 లో చేయను అని..ఆ స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్న జాన్వీ.. !?

వామ్మో.. ఏంటిది జాన్వి కపూర్ అప్పుడే ఐటమ్ సాంగ్ లో చేయడానికి ఒప్పేసుకునిందా ..? ఇది నిజంగా దారుణాతి దారుణమే అంటూ ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేయడం సర్వసాధారణం. కానీ అది కెరియర్ స్టార్టింగ్ లో కాదు ..ఒక 10 – 15 సినిమాల్లో నటించాక.. హిట్లు కొట్టాక .. ఐటెం సాంగ్ చేస్తే మనకి విలువ ఉంటుంది. కానీ ఒకే ఒక్క సినిమాతో ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకోవడం జాన్వి పెద్ద రిస్క్ చేస్తుంది అంటున్నారు అభిమానులు .

రీసెంట్గా జాన్వి కపూర్ గేమ్ చేంజర్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి యాక్సెప్ట్ చేసినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. బోనీ కపూర్ కి మొదటి నుంచి జాన్ జిగిడి దోస్త్ అయిన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాలో చరణ్ హీరోగా నటిస్తున్నారు . అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం కోసం జాన్వి కపూర్ ని చూస్ చేసుకున్నాడట శంకర్ . ఇదే విషయం బోనికపూర్ కు చెప్పగా మొదట నో చెప్పి ఆ తర్వాత ఫైనల్ గా ఓకే చేశారట.

అయితే అంతకుముందే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం జాన్విని చూస్ చేసుకుంటే ..”నా కూతురు నీకు ఐటమ్ గర్ల్ గా కనిపిస్తుందా..?” అంటూ సుకుమార్ తో ఫన్నీగా కౌంటర్ వేశాడట బోనీ కపూర్. అప్పుడు అలా అన్న వ్యక్తి ఇప్పుడు శంకర్ విషయంకి వచ్చేసరికి ఎలా మనసు మార్చుకున్నాడు ..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!