టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో….బాలయ్యకు జోడిగా ఆ హీరోయిన్..!

అన్ స్టాపబుల్  గా దూసుకుపోతోంది బాలయ్య “అన్ స్టాపబుల్ విత్ యెన్ బి కె” షో. ఇప్పటికే రెండు సీజన్ లను పూర్తి చేసుకొని, విజయవంతంగా మూడోవ సీజన్ ను ప్రారంభించారు మేకర్స్. ఈ షో మొదటి ఎపిసోడ్ ప్రోమో ను విడుదల చేసారు మేకర్స్. ఈ ప్రోమో ఇప్పటికే రెండు మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకొని యు ట్యూబ్ ను షాక్ చేస్తోంది. దీనికి ఒక కారణం బాలయ్య ఐతే, మరో కారణం షో కి వచ్చిన గెస్టులు. అన్ స్టోప్పబుల్ సీజన్ 3 , మొదటి ఎపిసోడ్ లో గెస్టులు గా వస్తున్నది “యానిమల్” చిత్రం దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, హీరో రణ్‌బీర్‌ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న.

ఈ షో లో బాలయ్య అడిగిన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారాన్ని లేపుతున్నాయి. రష్మిక ను ట్రెండ్ అయ్యేలా చేసాయి. ఐతే దీనికి కారణం బాలయ్య రష్మికకు ఐ లవ్ యూ చెప్పడమా? లేక రష్మిక కాల్ చెయ్యగానే వాట్స్ అప్ రే అంటూ మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పందించడమా? అన్నది ప్రేక్షకులకే తెలియాలి. ఐతే ఈ షో లో బాలయ్య రష్మికను ఇంట్రడ్యూస్ చేసిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. “నా మైండ్ బ్యాలన్స్ లో లేదిక, ఎందుకో ఈ తికమక, ఇక వచేయమ్మా రష్మిక” అంటూ బాలయ్య ఇచ్చిన ఇంట్రో, రష్మిక ఫాన్స్ ను బాగా ఇంప్రెస్స్ చేసింది. ఇక బాలయ్య రష్మికను పొగుడుతుంటే, ఆమె నవ్వినా నవ్వు అమేజింగ్ అంటున్నారు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై వీరిద్దరూ కలిసి నటిస్తే అదిరిపోతుంది అంటూ మరి కొందరు తమ కోరికను వెళ్లబుచ్చారు.

ఈ ప్రోమోలో రష్మిక, రణ్‌బీర్‌ ల ఇంట్రో, విజయ్ దేవరకొండ రష్మిక ఫోన్ లిఫ్ట్ చెయ్యడం, బాలయ్య రష్మిక కు ఐ లవ్ యూ చెప్పడం…ఇలా గూస్ బమ్స్ తెప్పించే మూమెంట్స్ ఎన్నో ఉన్నాయ్. కానీ అన్నింటికంటే అదిరిపోయే సీన్ ఏది అంటే, రన్బీర్ బాలయ్య లెజెండ్ చిత్రం డైలాగ్ తెలుగులో చెప్పడమే అని చెప్పాలి.