భోజనం తిన్న తరువాత సోంపు గింజలు నమిలితే ఏమవుద్దో తెలుసా…!!

సోంపు గింజలను మనం తరచూ భోజనం చేశాక నోట్లో వేసుకుంటూ ఉంటాము. ఈ సోంపు గింజలు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. సోంపు గింజలను తినడం వల్ల కడుపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలను నివారించడంలో బాగా సహాయ పడతాయి.

2. ఇది తింటే కొలెస్ట్రాల్ స్థాయి పెరగదు. తద్వారా భోజనం చేశాక 30 నిమిషాల తర్వాత ఒక చెంచా సోంపు తినడం మంచిది.

3. రుతుక్రమం సక్రమంగా ఉండేందుకు సోంపు బాగా సహాయపడుతుంది. దీనిని బెల్లం కలిపి తింటే మంచిది.

4. పసి బిడ్డలకు కడుపునొప్పి తొలగించడానికి సోంపు ఎంతో బాగా సహాయపడుతుంది.

5. రోజు 5,6 గ్రాముల సోంపును తీసుకోవడం వల్ల కాలేయం, కంటిచూపు ఆరోగ్యంగా ఉంటుంది.

ఇన్ని సమస్యలను తగ్గించే సోంపు తినడం ఇకనుంచి అయినా మొదలుపెట్టండి. ఈ సోంపు తిని మీ అనారోగ్యాలని తరిమి కొట్టండి