సినిమాలతో పాటు అలా కూడా డ‌బ్బులు సంపాదిస్తున్న శ్రీ‌లీలా.. ఏం చేస్తుందంటే..?

టాలీవుడ్ మోస్ట్ బిజియస్ట్ యంగ్ బ్యూటీ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది శ్రీలీల. పెళ్లిసంద‌డి లాంటి చిన్న సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. మొదటి సినిమాతో ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోకపోయినా.. తరువాత రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి తన సత్తా చాటుకుంది. డ్యాన్స్, నటనతోను కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ వరస సినిమా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది. ఇటీవల బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న శ్రీ లీల ప్రస్తుతం మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటిస్తుంది.

ఇటీవల మెగా హీరో వైష్ణవ తేజ్‌తో కలిసి ఆదికేశవ సినిమాలో న‌టించింది. ఇక ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో కూడా సందడి చేస్తుంది. ఇక ఫార్చ్యూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ సినీ బ్యానర్ పై రూపొందిన ఆదికేశవ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే శ్రీ లీల సినిమాల్లో హీరోయిన్ గా నటించడమే కాకుండా మరో విధంగా కూడా తను డబ్బును సంపాదిస్తుందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే సినిమాల్లో నటించడమే కాదు ప్రమోషన్స్ ద్వారా కూడా డబ్బు సంపాదిస్తుందట శ్రీ లీల.

ప్రమోషన్ లో పాల్గొనడానికి కూడా ఒక పర్టికులర్ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందట. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న శ్రీ లీల.. సమయం దొరికినప్పుడల్లా ప్రమోషన్స్‌కు హాజరై.. ఆ టైంను కూడా క్యాష్ చేసుకుంటుందట‌. ఇక ఈమెను ప్రమోషన్స్ కోసం మరో రూ.12 లక్షలు అదనంగా ఇచ్చి మరి తీసుకుంటున్నారట నిర్మాతలు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో శ్రీ లీల అంటే ఆ మాత్రం డిమాండ్ ఉంటుంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.