మహేష్ బాబు నమ్రతల పెళ్లి వెనుక వివాదంలో నిజం ఎంత?

సినీ పరిశ్రమలో పెళ్లిళ్లు పెటాకులు అవ్వడం చాలా సహజం అన్న అభిప్రాయం ప్రజలలో బాగా లోతుగా నాటుకుపోయింది. కానీ ఈ అపోహలను చెరిపేస్తూ అన్యోన్యమైన దాంపత్యానికి ఉదాహరణలుగా మారుతున్నారు మన కుర్ర హీరోలు. వీరిలో అందరి దృష్టిని ఆకర్షించే జంట, సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతలది. అప్పట్లో వీరి వివాహం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఐతే నమ్రత, మహేష్ బాబుని కిడ్నప్ చేసి పెళ్లి చేసుకుందని ఒక ఆశ్చర్యకరమైన వార్త వినిపిస్తుంది. ఈ వార్తలో నిజం ఎంతో ఇప్పుడు చూద్దాం.

ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి వారసుడిగా వెండి తెర పై అడుగుపెట్టాడు మహేష్ బాబు. రాజకుమారుడు చిత్రంతో మొదలుకొని, ఒక్కడు, పోకిరి, మురారి, దూకుడు వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి సూపర్ స్టార్ గా ఎదిగాడు. అమ్మాయిలలో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి మహేష్ బాబు పెళ్లి విషయానికొస్తే, మహేష్ నమ్రతలు వంశి సినిమాలో కలిసి నటిస్తున్న సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే విషయం మనందరికీ తెలిసినదే. ఐతే అసలు విషయం ఏమిటంటే, వంశి సినిమా షూటింగ్ సమయంలో నమ్రత, మహేష్ కు ప్రపోజ్ చేసిందట. కానీ మహేష్ చాలా కాలం ఆమె ప్రపోసల్ కు ఎస్ చెప్పలేదట.

ఐతే “అతడు” సినిమా షూటింగ్ సమయంలో మహేష్, త్రిషకు క్లోజ్ అవుతున్నాడనే వార్త నమ్రతకు తెలిసింది. దాంతో వెంటనే మహేష్ ముందు పెళ్లి ప్రపోసల్ పెట్టేసింది. దాంతో స్టార్ హీరో కుమారుడైనప్పటికీ, అతని పెళ్లి, చాలా సింపుల్ గా, రహస్యంగా కేవలం కొందరు కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. కారణం మహేష్ బాబు నమ్రతను పెళ్లి చేసుకోవడం కృష్ణ గారికి ఇష్టం లేకపోవడమే. కానీ ఉన్నట్టుండి వీరి పెళ్లి ఫోటోలు బయటలు రావడంతో ఒక వింత ప్రచారం మొదలయింది. అదేమిటంటే ముంబై మాఫియా గ్యాంగ్ మహేష్ బాబుని కిడ్నాప్ చేసి, అతనికి ఇష్టం లేకపోయినా బలవంతంగా నమత్రతతో రహస్యంగా పెళ్లి చేసారని. నమ్రతకు మహేష్ అంటే ఇష్టం ఉండడంతో ఆమె అక్క శిల్ప మాఫియాతో మాట్లాడి ఇలా పెళ్లి జరిపించింది అనుకునేవారు అంతా.

ఐతే ఈ పుకారులో నిజం ఎంత అన్నది ఎవరికి తెలియదు. ఎందుకంటె పెళ్లి అయ్యి సుమారు 20 ఏళ్ళు కావస్తున్నా మహేష్, నమ్రతలు ఇంకా అన్యోన్యంగానే ఉన్నారు. ఆ పుకారు నిజం అయ్యి ఉంటె వీరిద్దరూ ఈపాటికే విడాకులు తీసుకొని ఉండాలి. కానీ ఆలా జరగలేదు. కాబట్టి వీరిద్దరూ నిజంగానే ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, అందుకే ఇంకా కలిసి జీవిస్తున్నారని అంటున్నారు అభిమానులు.