అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటి లోకి స్కంద మూవీ..!!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సినిమా స్కంద.. ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించడం జరిగింది. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించగా బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ నటించడం జరిగింది. స్కంద సినిమా పోస్టర్, టీజర్ ,ట్రైలర్ విడుదలకు ముందే మంచి హైప్ ఏర్పడింది. సెప్టెంబర్ 28న చాలా గ్రాండ్గా థియేటర్ లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ గానే కలెక్షన్ల వైపు అడుగులు వేసింది.

ఇప్పటివరకు రామ్ ని ఈ విధంగా ఎవరు చూపించలేదు.. మొదటిసారి ఊర మాస్ హీరోగా కనిపించిన రామ్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. దాదాపుగా 50 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ సాధించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రిమ్మింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా 35 కోట్ల రూపాయలు కలక్షన్స్ సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్లో విడుదలైన 50 రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటి లోకి తీసుకురావాలని ఒప్పందం ఉన్నది.

అయితే ఇప్పుడు ముందుగానే డిజిటల్ స్ట్రిమింగ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 27 నుంచే స్కంద సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా పై త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలుపడే అవకాశం ఉన్నది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఇందులో స్పెషల్ సాంగులు నటించింది. హీరో రామ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్లో నటిస్తూ ఉన్నారు.