బాల‌య్య హ్యాండ్ ప‌డింది కాజ‌ల్ ల‌క్ మారిపోయింది..!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 2007లో ” లక్ష్మీ కళ్యాణం ” సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తర్వాత తెలుగుతో పాటు పలు భాషల్లో నటించింది. అలా తన కెరీర్ లో హీరోయిన్ గా మొత్తం 50 సినిమాలు పూర్తి చేసుకుంది. ఇక తాజాగా ” భగవంత్ కేసరి ” సినిమాలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే.

తన నటనతో, అందంతో ఎంతోమంది ప్రేక్షకులని దక్కించుకుంది. అయితే వివాహం తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ తిరిగి తన పని స్టార్ట్ చేసింది. దీంతో పాటు వరుస భారీ సినిమాలు లైన్లో పెట్టింది. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ” ఇండియన్ 2 ” లో నటిస్తోంది.

అలాగే ” సత్యభామ ” హిందీలో ” ఉమా ” సినిమాలు చేస్తుంది. అలాగే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున సరసన నటిస్తుంది. మొత్తానికి బాల‌య్య అలా ఛాన్స్ ఇచ్చాడో లేదో కాజల్ అగర్వాల్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. ఇక ఇదే జోరులో కొనసాగితే ఈమె కెరీర్ కి తిరిగే ఉండదు.