ఆరోహి రావు బిగ్ బాస్ 6లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే గలగల మాట్లాడుతూ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కంటెస్టెంట్ సూర్యతో ఆరోహి రావు సన్నిహితంగా ఉండేది. అనూహ్యంగా నాలుగో వారమే ఆమె బిగ్ బాస్ జర్నీ ముగిసిపోయింది. ఆ తర్వాత ఎక్కువగా కనిపించలేదు. తాజాగా ఆరోహి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.
” ఆన్లైన్ సెల్లింగ్ యూప్స్ ఫ్లిప్ కార్ట్, మీషోలలో రెండు వస్తువులు ఆర్డర్ చేశాను. నాలుగు రోజుల క్రితం ఒక డెలివరీ రావడంతో రెండిటిలో ఏదో ఒక ఐటమ్ వచ్చి ఉంటుందని చెక్ చేయకుండా యూపీఐ పేమెంట్ చేశాను. తీరా ఐటెం ఓపెన్ చేసి చూస్తే వైట్ క్లాత్ మాత్రమే ఉంది. దీంతో మీ షో హెల్ప్ సెంటర్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తే రెండు రోజుల్లో మెయిల్ వస్తుందని అన్నారు.
నాలుగు రోజులైనా ఎలాంటి మెయిల్ రాలేదు. వాళ్ల నుంచి సరైన రెస్పాన్స్ లేదు. ఇది టోటల్గా మీ షో యాప్ ఫ్రాడ్. మీరు కొనే ముందు జాగ్రత్తగా ఉండండి. నా మాద్రి మోసపోవద్దు ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆరోహి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.