మ్యాన్షన్ 24 నెక్ట్స్ సీరిస్‌లో బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్లు… హౌస్‌లోనే ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన ఆ ముగ్గురు ఎవ‌రంటే…!

బిగ్ బాస్ 7 స్టార్ అయి ఇప్పుడు ఏడో వారం కొనసాగుతుంది. ఇక శుక్రవారం ఎపిసోడ్ కు మ్యాన్షన్ 24 నటీనటులు హౌస్ లోకి వెళ్లారు. ఈ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ కోసం ఓంకార్, వరలక్ష్మి శరత్ కుమార్ , నందు, అవికాగోర్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు.

అక్కడ కంటెస్టెంట్స్ తో మాట్లాడి వారికి మ్యాన్షన్ 24 కు సంబంధించిన కొన్ని సీన్స్ లో నటించాలని చెప్పారు. అందులో భాగంగా బాగా నటించిన ముగ్గురిని సెలెక్ట్ చేశారు.అందులో టేస్టీ తేజ, ఆట సందీప్, యావర్ సూపర్ గా నటించి ఓంకార్‌ను మెప్పించారు.

దీంతో ఓంకార్ ఆ ముగ్గురిని మ్యాన్షన్ 24 నెక్స్ట్ సిరీస్లో నటించే ఛాన్స్ ఇచ్చాడు. ఇది విన్న కంటెస్టెంట్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక మ్యాన్షన్ 24 సిరీస్లో అమర్దీప్ నటించిన సంగతి తెలిసిందే. తనకి ఒక ఆల్బమ్ గిఫ్ట్ గా ఇచ్చారు. అది చూసిన అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.