రాజేంద్రప్రసాద్ ” కృష్ణారామ ” ట్రైలర్… అబ్బా అద‌ర‌గొట్టాడుగా ( వీడియో)

ఈ మధ్యకాలంలో ఓటీటీలు వచ్చిన తర్వాత చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలా హిట్ అవుతున్నాయి. జనాలు కూడా వాటిని ఇష్టపడుతున్నారు. ఇక తాజాగా సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, గౌతమి నటించిన సినిమా ” కృష్ణారామ “. అలాగే ఈ వెబ్ సిరీస్ లో యూట్యూబ్ స్టార్ అనన్య కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ” ఈటీవీ విన్ ” లో అక్టోబర్ 22 నుంచి అందుబాటులోకి రానుంది.

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటన చేసిన మేకర్స్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఫేస్బుక్ కారణంగా ఇద్దరు వృద్ధులు రాజేంద్రప్రసాద్, గౌతమి సెలబ్రిటీలుగా మారడంతో ట్రైలర్ మొదలవుతుంది. కానీ తర్వాత ఇద్దరూ ఓ పెద్ద సమస్యలో చిక్కుకుంటారు. సమాజానికి వ్యతిరేకంగా ఆ దంపతులు పోరాడడం ఇందులో చూడొచ్చు.

పూర్తి కథ ఏమిటో తెలియాలంటే అక్టోబర్ 22 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక అనన్య నటన గురించి చెప్పాలంటే.. వెబ్ సిరీస్ తో, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. ఇదే జోర్లో కొనసాగితే ఈ అమ్మడికి తిరుగులేని స్థాయిలో ఆఫర్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by ETV Win (@etvwin)