రవితేజ ” టైగర్ నాగేశ్వరరావు ” సినిమాలో కోత‌లు… ఎంత కోసేశారంటే…!

మాస్ మహారాజు రవితేజ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గత ఏడాది రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా తెరకెక్కిన ” ధమాకా ” సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. రవితేజ హీరోగా తాజాగా రిలీజ్ అయిన మూవీ ” టైగర్ నాగేశ్వరరావు “. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 20వ తేదీన ఈ సినిమా విడుదలైంది.

అభిమానుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉండగా.. విడుదలైన రెండు రోజులకే చిత్ర బృందం సంచలన నిర్ణయం తీసుకుంది. సినిమా రన్ టైం లో మార్పులు చేసింది. సుమారు అరగంట సినిమా నిడివి తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ మేరకు 2.37 గంటల రన్ టైం తో ఇకపై ఇది ప్రేక్షకులను అలరించనుంది. సినీ ప్రియుల నుంచి వస్తున్న రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకొని చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా మంచి టాక్ ని దక్కించుకోవడంతో రవితేజ అభిమానులు ఫుల్ ఖుషి గా ఉన్నారు.