గతంలో రజినీకాంత్ నటించిన ” చంద్రముఖి ” మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. నయనతార, ప్రభు, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక ఇదే మూవీకి సీక్వెన్స్ గా ” చంద్రముఖి 2 ” సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ దక్కించుకుంది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రానౌత్, లారెన్స్ లీడ్ రోల్స్ లో వడివేలు, రాధిక, లక్ష్మి మీనన్, మహిమా నంబియార్, శృతి డాంగే కీలక పాత్రలో నటించారు.చంద్రముఖి పాత్రలో కంగనా రానౌత్ ఒదిగిపోగా… పార్ట్ వన్ లో మాద్రి గానే బనవయ్యగా మెప్పించిన స్టార్ కమెడియన్ వడివేలు.. మళ్లీ ఈ సినిమాలో అదే పాత్రలో కనిపించాడు.
అలాగే ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. అయితే ఇక ఓటీటీ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అనీ ఎదురు చూస్తుండగా మొత్తానికి రిలీజ్ డేట్ వచ్చేసింది. ప్రస్తుతం ఓటీటీ సమస్త నెట్ ఫిక్స్ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకోగా అక్టోబర్ 26 నుంచి అందుబాటులోకి రానుంది.