” భగవంత్ కేసరి “.. మూడు రోజుల కలెక్షన్లు… బాల‌య్య జోరు మామూలుగా లేదే..!

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన మూవీ ” భగవంత్ కేసరి “. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా శ్రీ లీల బాలయ్యకు కూతురుగా నటించిన సంగతి మనకి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదలై హిట్ టాక్ తో కలెక్షన్స్ భారీగా రాబడుతూ బాక్సాఫీస్ ని షేక్‌ చేస్తుంది.

తాజాగా ఈ సినిమాకి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 71.02 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసినట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అసలు దీనికి పెట్టిన బడ్జెట్ రూ. 60 కోట్లుగా సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే చిత్ర యూనిట్ లాభాల బాట పట్టిందని చెప్పొచ్చు. అలాగే 100 కోట్లు వైపు దూసుకుపోతుంది.

ఇక ఈ సినిమాలో విలన్ గా అర్జున్ రాంపాల్ టాలీవుడ్ కి అడుగుపెట్టాడు. టాలీవుడ్ కి అడుగుపెడతం తోనే హిట్ ని ఖాతాలో వేసుకున్న అర్జున్ రాంపాల్ తిరుగులేని కెరీర్ తో దూసుకుపోతాడు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక మూడు రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉంటే ఇక వారం పూర్తయ్యేటప్పటికీ ఏ విధంగా ఉంటుందో ఊహించుకుంటేనే కళ్ళు చెదురుపోతున్నాయి.