రూ. 100 కోట్లు తీసుకునే ప్ర‌భాస్ ఫ‌స్ట్ మూవీ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు!

బాహుబలి సినిమాతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. ప్రస్తుతం చేతినిండా భారీ బడ్జెట్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అలాగే ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు తగ్గకుండా రెమ్యున‌రేషన్ తీసుకుంటున్నాడు. అలాంటి ప్రభాస్ ఫస్ట్ మూవీ పారితోషికం ఎంతో తెలిస్తే నోరెళ్ళబెడతారు.

రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు సోద‌రుడి కుమారుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ప్ర‌భాస్‌.. 2002లో `ఈశ్వ‌ర్‌` మూవీతో హీరోగా తొలిసారి వెండితెర‌పై మెరిశాడు. జయంత్ సి పరాంజి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్ కూమార్ హీరోయిన్ గా న‌టించింది. రేవతి, శివకృష్ణ, బ్రహ్మానందం త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

అశోక్ కుమార్ ఈ సినిమాను నిర్మించ‌గా.. ఆర్. పి. పట్నాయక్ స్వ‌రాలు అందించారు. అయితే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం యావ‌రేజ్ గా ఆడింది. కానీ, ప్ర‌భాస్ న‌ట‌న‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ సినిమాకు ప్ర‌భాస్ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. జస్ట్ రూ. 4 ల‌క్ష‌లు. అవును, గ‌తంలో ప్ర‌భాస్ ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టారు.