నేషనల్ అవార్డ్ విన్నర్ కు మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ పార్టీ (వీడియో)..

అల్లు అర్జున్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని సంపాదించుకున్నాడు. ఇక ” పుష్ప ” సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇటీవల 69వ జాతీయ చలన చిత్ర అవార్డు కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. అందులో భాగంగా టాలీవుడ్ లో ప్రముఖులు అవార్డులను సొంతం చేసుకున్నారు.

ఉత్తమ నటుడుగా పుష్ప ది రైజ్ సినిమాకి గాను అల్లు అర్జున్, డైరెక్టర్ కింగ్ సాలమన్, డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రేమ రక్షత్, చంద్రబోస్, కాలభైరవ, రాజమౌళి, దేవి శ్రీ ప్రసాద్, కీరవాణి, శ్రీనివాస్‌ మోహన్ వంటి వారికి అవార్డులు వచ్చాయి. తాజాగా, మైత్రి మూవీ మేకర్స్ విన్నర్స్ కు గ్రాండ్ పార్టీ ఇచ్చారు.

శనివారం రాత్రి హైదరాబాద్లో నిర్వహించిన ఈ పార్టీలో దేవిశ్రీ ప్రసాద్ లైవ్ సాంగ్స్ తో అలరించాడు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇక అల్లు అర్జున్ ” పుష్ప 2 ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి మరిన్ని అవార్డులు దక్కించుకోవాలని తమ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.