బాలయ్య పై మరొకసారి అదిరిపోయే ట్వీట్ చేసిన పూనమ్ కౌర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట మాయాజాలం అనే సినిమా ద్వారా పరిచయమయ్యింది హీరోయిన్ పూనమ్ కౌర్.. అచ్చ తెలుగు ఆడపడుచుల తన ఆనందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత ఎన్నో వివాదాలు ద్వారా మరింత పాపులారిటీ అందుకుంది ప్రస్తుతం రాజకీయాలలో తరచూ ఆక్టివ్ గా ఉంటోంది పూనమ్ కౌర్.. సోషల్ మీడియాలో ఏదైనా ట్రీట్ పెట్టడం ఆలస్యం నిమిషాలలో వైరల్ గా మారుతూ ఉంటుంది

తాజాగా ఈ అమ్మడు ఒక సినిమా గురించి ట్విట్ చేసింది అదే భగవంత్ కేసరి.. బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు బాలయ్య నటన నెస్ట్లెవల్లో ఉండడంతో శ్రీ లీల నటన కూడా బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఇందులో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి బాలయ్య చెప్పడం చాలా అద్భుతంగా ఉందంటూ అభిమానులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మళ్లీ ఇప్పుడు ఈ సినిమా పైన పూనమ్ కౌర్ ప్రశంసల వర్షం కురిపించింది సినిమా చాలా బాగుందని తెలుపుతూ అంతేకాకుండా తాను కూడా బాలయ్య ఫ్యాన్ బ్యాచ్లో చేరిపోతున్నానంటే తెలియజేయడం జరిగింది.. భగవంత్ కేసరి సినిమా చూడడం చాలా రిఫ్రెష్ గా ఉందంటూ.. నేను కూడా జై బాలయ్య బ్యాచ్ లో చేరాలనుకుంటున్నాను.. లడికి కో షేర్ బనావో అంటూ రాసుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో బాలయ్య అభిమానుల సైతం ఈమెను వెల్కమ్ బ్యూటీ అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలయ్య పైన చేసిన ట్వీట్ వైరల్ గా మారుతోంది.