లియో అడ్వాన్స్ బుకింగ్స్.. భారీ ప్లాన్ వేసిన విజయ్..!

లోకేష్ కనగరాజు విజయ్ దళపతి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం లియో.. ప్రస్తుతం ఈ సినిమా తమిళనాడులోనే కాదు తెలుగు రాష్ట్రాలలో అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తూ ఉండడంతో సినిమాపై అంచనాలు కూడా తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఇదివరకే లోకేష్ కనగరాజు విక్రమ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు లియో మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగ రాయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్ లు కూడా మొదలయ్యాయి.

అక్టోబర్ 19వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ఏకంగా రూ.110 కోట్ల ఓపెనింగ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే విజయ్ దళపతి రజినీకాంత్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులను బ్రేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రజినీకాంత్ రోబో 2.0 మూవీ రూ .95 కోట్లతో రికార్డు బ్రేక్ చేయగా అత్యధిక తొలి రోజు వసూలు సాధించిన సినిమాగా ఇప్పుడు లియో నిలవబోతోంది. ఇప్పటికే యూకే లో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రికార్డు క్రియేట్ చేసింది అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 70 వేల టికెట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఇక అక్కడ అత్యధిక ఓపెనింగ్ సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించబోతోంది.

 

ఇప్పటికే మొదటిరోజు రూ .50 కోట్ల వరకు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని అలాగే ఇండియాలో కూడా ఇంకో రూ.60 కోట్లు వస్తాయని అంచనాలు వేస్తున్నారు చిత్ర బృందం. ఇకపోతే ఈ సినిమా కేరళలో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే రూ .5కోట్ల మార్కు అందుకుంది. ఇక ఈ ప్రీమియం టికెట్లు అయితే ఒక్కో టికెట్ ఏకంగా రూ.2,400 అమ్ముతున్నారు. నార్త్ లో కూడా టికెట్ ధరలు రూ .300 నుంచి రూ .700 వరకు ఉన్నట్లు సమాచారం. మరొకవైపు దసరా హాలిడేస్ కూడా ఉండడంతో పండుగ సెలవులను క్యాష్ చేసుకోవాలని పక్కా ప్లాన్ తో విజయ దళపతి టీం ఈ సినిమాని దసరా పండుగకు రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.