శ్రీలీల అంటే బాలయ్య కు అంత ఇష్టమా..? ఆమె కోసం అలా కూడా చేశాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి . ఈ సినిమాను అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో దర్శకత్వం వహించారు . అక్టోబర్ 19న దసరా కానుకగా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో కనిపించబోతుంది .

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ని లాంచ్ చేశారు మేకర్స్ . ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హనుమకొండలో చాలా ఘనంగా జరిగింది . ఈ క్రమంలోనే శ్రీ లీల చాలా పద్ధతిగా రెడీ అయ్యి స్టేజిపై తన స్పీచ్ తో అదరగొట్టేసింది . పట్టు పరికిణిలో కుందనపు బొమ్మల మెరిసిపోయింది . అయితే ఈ పట్టు పరికిణి ఆమెకు గిఫ్ట్ చేసింది బాలయ్య అని అంటూ తెలుస్తుంది .

ఆమె పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య అచ్చ తెలుగు పద్ధతిలో ఆమెకి పావడ – పయట – గాజులు – పూలు పండ్లు గిఫ్ట్ చేశారట . దీంతో ఫిదా అయిపోయిన శ్రీ లీల అది ఏదైనా మంచి ఈవెంట్ కి కట్టుకుందాము అంటూ దాచిపెట్టిందట . ఫైనల్లీ భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కి ఆ పట్టు పరికిణి వేసుకుంది . అంతేకాదు సెట్స్ లో ఉన్నప్పుడు శ్రీ లీల కోసం బాలయ్య ఆమెకి ఇష్టమైన ఫుడ్ కూడా ఇంటి నుండి వండించి మరి తీసుకొచ్చేవాడట..!!