అల్లు అర్జున్‌, రాజ‌శేఖ‌ర్ కాంబోలో మిస్ అయిన హిట్ మూవీ ఏదో తెలుసా?

స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన యాంగ్రీ యంగ్‌మెన్ రాజ‌శేఖ‌ర్‌.. ఆ మ‌ధ్య సోలోగా హిట్ అందుకుని చాలా కాల‌మే అయిపోయింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే నితిన్ హీరోగా తెర‌కెక్కుతున్న `ఎక్స్‌ట్రా` మూవీకి క‌మిట్ అయ్యారు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. అయితే గ‌తంలో ఇటువంటి స‌హాయ‌క పాత్ర‌లు రాజ‌శేఖ‌ర్ వ‌ద్ద‌కు చాలా వ‌చ్చాయి.
కానీ, అప్పుడే స‌హాయ‌క న‌టుడిగా మార‌డం ఇష్టం లేక‌ రాజ‌శేఖ‌ర్ రిజెక్ట్ చేశారు. అలా వ‌దులుకున్న ప్రాజెక్ట్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ మూవీ కూడా ఉంది. ఇంత‌కీ ఆ సినిమా మరేదో కాదు `సన్నాఫ్ సత్యమూర్తి`. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, స‌మంత జంట‌గా న‌టించారు. క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర‌, నిత్యా మీన‌న్‌, అదా శ‌ర్మ‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్రకాష్ రాజ్, స్నేహ.. త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.
హారిక & హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఆ ఫ్యామిలీ అండ్‌ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ 2015లో విడుద‌లై మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో నిత్యామీన‌న్ కు అన్న‌గా నెగ‌టివ్ షేడ్స్ ఉన్న దేవరాజు నాయుడు పాత్ర‌లో ఉపేంద్ర న‌టించారు. సినిమాలో బాగా హైలెట్ అయిన పాత్ర‌లో ఆయ‌న‌ది ఒక‌టి. ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. ఆ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ రాజ‌శేఖ‌రే. త్రివిక్ర‌మ్ మొద‌ట రాజ‌శేఖ‌ర్ ను సంప్ర‌దించ‌గా.. ఆయ‌న నో చెప్పారు. దాంతో ఆ రోల్ కోసం క‌న్నడ స్టార్ ఉపేంద్ర‌ను రంగంలోకి దింపారు. అలాగే అల్లు అర్జున్‌, రాజ‌శేఖ‌ర్ కాంబోలో సన్నాఫ్ సత్యమూర్తి మూవీ మిస్ అయిపోయింది.