పరగడుపున లెమన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందా..?

ఇటీవల కాలంలో చాలామంది బెడ్ కాఫీ బెడ్ టీల‌కు అలవాటు పడుతున్నారు. ఏమి తినకముందే కాఫీ, టీ తాగాలని ఆశిస్తున్నారు కొంతమంది. బ్లాక్ టీ తాగ‌గా.. మరి కొంత మంది మిల్క్ టీ తీసుకుంటున్నారు. కానీ ఈ అలవాటు వల్ల శరీరానికి చాలా హాని కలుగుతుందట. ఎసిడిటీ, అజీర్ణం లాంటి సమస్యలు ఎదురయ్య ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఉండే టీ, కాఫీల కంటే లెమన్ టీ, లెమన్ గ్రాస్‌టీ వంటి ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలను అందిస్తాయట.

నిమ్మకాయ సిట్రస్ పండు ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వాటిలో చాలా విటమిన్లు పోషకాలు ఉంటాయి. ఆంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి పుష్కలంగా లభించే నిమ్మకాయ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఐరన్, పొటాషియం, జింక్, మాంగనీస్, ప్రోటీన్లు వస్తాయి. లెమన్ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. దీని తయారు చేసుకోవడానికి ముందుగా నీటిని మరిగించి టీ పొడిని వేసుకోవాలి. ఆ తర్వాత దానిలో నిమ్మరసాన్ని కలిపి బెల్లం లేదో తేనే కలిపి తీసుకుంటే సరిపోతుంది.

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి మీ ఆహారంలో లెమన్ టీ యాడ్‌ చేసుకోవడం వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. లెమన్ టీ జీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరంలోని జీవన క్రియను సులభతరం చేయడం కూడా స‌హాయ‌ప‌డుతుంది. లెమన్ టీ ని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎసిడిటీ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గించడానికి డయాబెటిస్ రోగులకు లెమన్ టీ క్రమం తప్పకుండా ఇవ్వాలి.

గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం చిటికెడు తేనే కలిపి తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పొటాషియం, మెగ్నీషియం, జింక్, కాపర్ వంటి ఆంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉన్న లెమన్ టీ స్ట్రెస్ ను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. నిమ్మకాయల ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు శరీరంతో పాటు చర్మానికి మంచి చేసి ఆరోగ్యంగా కాంతివంతంగా చర్మం ఉండేలా చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా లెమన్ టీ ఉపయోగపడుతుంది. శరీరంలో కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గుతారు కాబట్టి రెగ్యులర్ గా కాళీ గడుపుతూ లెమన్ టీ తాగడం మంచిది.