స్కంద మూవీ రివ్యూ…రామ్ పాన్ ఇండియా హీరో అయ్యాడా..!!

డైరెక్టర్ పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ పోతినేని.. ఆ తర్వాత సరైన సక్సెస్ ని అందుకోలేకపోయారు. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద సినిమాలో నటించారు. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించింది. యాక్షన్ సినిమాల ఉండబోతుందని టీజర్ ట్రైలర్లు చూపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే ఈ రోజున ప్రేక్షకుల ముందుకు స్కంద సినిమా రావడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

హీరో రామ్ పోతినేని ఎంట్రీ ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉందంటూ పలువురు నెటిజన్లో ట్విట్టర్ రూపంలో తెలుపుతున్నారు ముఖ్యంగా శ్రీ లీల డ్యాన్స్ కూడా అదిరిపోవడంతో ఈ సినిమాకి మరింత హైప్ పెరిగిపోయింది. శ్రీ లిల కూడా ప్రస్తుతం మంచి ఊపులో ఉండడంతో ఈ అమ్మడుకి బాగా కలిసి వచ్చింది. ఇందులోని కేవలం ఒక్క పాట మాత్రమే బాగా క్లిక్ అయింది.

ఇక మరొక నేటిజన్ పాన్ ఇండియా సినిమా అన్నావు కనీసం హిందీలో షోలే లేవు.. కర్ణాటక, తమిళంలో లేవు సరైన విధంగా ఎప్పుడు రిలీజ్ చేయవు.. హిందీలో కనీసం చెప్పుకొని స్క్రీన్ అయినా సరే తీసుకురండి అంటూ ఒక నేటిజన్ తెలియజేయడం జరిగింది.

స్కంద మూవీ టైటిల్ తోనే ఈ సినిమా బిజిఎం అదిరిపోయిందని సంగీత దర్శకుడు థమన్ ని ప్రశంసిస్తున్నారు. బాలయ్య బాబుకు స్పెషల్ థాంక్స్ తో మొదలవుతుంది.

స్కంద సినిమాలో రామ్ మాస్ ఎంట్రీ అదిరిపోయిందని ఆ సిన్ కు థమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందని రామ్ అభిమానులను కూడా మెప్పించే విధంగా ఉందని తెలియజేస్తున్నారు నేటిజన్స్.. కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని ధీమాని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇందులోని ప్రతి ఒక్కరి నటన చాలా అద్భుతంగా ఉందని తెలియజేస్తున్నారు. మరి పూర్తి రివ్యూ కావాలి అంటే మరో కొద్దిసేపు ఆగాల్సిందే..