డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి స్పెషల్ గా విషెస్ చెప్పిన ఛార్మి.. పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో సినిమాలను తెరకెక్కించి ఎంతోమంది హీరోలను స్టార్ హీరోలుగా చేసిన ఘనత పూరి జగన్నాథ్ కు ఉందని చెప్పవచ్చు. ఒకానొక సమయంలో పూరి జగన్నాథ్ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలు చాలామంది డైరెక్టర్లు సైతం తమ సినిమాలను పోస్ట్ ఫోన్ చేసుకునేవారు.. అతి తక్కువ సమయంలోనే సినిమాలను తెరకెక్కించిన ఘనత కూడా పూరి జగన్నాథ్ అందుకున్నారు.

ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా తర్వాత మళ్లీ ఇస్మార్ట్ శంకర్ తోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా లెవెల్లో తెలకెక్కించిన లైగర్ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. లైగర్ సినిమా కంటే ముందు పూరి జగన్నాథ్ ముంబై కి షిఫ్ట్ అయ్యారు.. అక్కడే కూడా ఉండడం జరిగింది. పూరి జగన్నాథ్ కుటుంబం మొత్తం హైదరాబాదులోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉంటారు పూరి .గతంలో పూరి జగన్నాథ్ తన భార్యతో కలిసి ఏదో పూజలు చేస్తున్నట్టుగా కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.. దీంతో పూరి జగన్నాథ్ తన కుటుంబంతోనే ఉన్నారని అందరికీ. అప్పటినుంచి విడాకుల రూమర్స్ ఆగిపోయాయి.

గతంలో ఒకసారి పూరి జగన్నాథ్ కుమారుడు ఆడియో ఫంక్షన్ కి వచ్చిన బండ్ల గణేష్ పూరి జగన్నాథ్ భార్య లావణ్య గొప్పతనం గురించి తెలియజేస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో పూరి జగన్నాథ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. ఇలా పూరి పర్సనల్ లైఫ్ ఎప్పుడు కూడా కాంట్రవర్సీలకే మిగిలిపోయింది. పూరి కొడుకుని నిలబెట్టేందుకు తను ఎంతగా ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. ఈ రోజున పూరి జగన్నాథ్ బర్తడే సందర్భంగా ముంబైలో తన టీం తో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక చార్మి అర్ధరాత్రి నైట్ పూరికి విషెస్ తెలియజేస్తూ తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Charmmekaur (@charmmekaur)