రజినీ కాంత్ జైలర్-2 మూవీ మొదలు..ఈసారి అంతకుమించి..!!

ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలోనైనా సరే సీక్వెల్ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతోంది. ప్రతి సినిమా కూడా క్లైమాక్స్ లో సీక్వెల్ ఉన్నట్లుగా హింట్ ఇవ్వడం జరుగుతోంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు సీక్వెల్ ని ప్రకటించి ఆ సినిమాకు ఉన్న హైపుని సైతం వాడుకోవాలని మేకర్స్ పలు రకాల ప్లాన్స్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది విడుదలై హిట్ అయిన సినిమాలు ప్రకటించే పనిలో పడ్డారు. అలా ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన చిత్రాలలో జైలర్ సినిమా కూడా ఒకటి..

ఇక ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రజనీకాంత్ దాదాపుగా ఎన్నో సంవత్సరాలుగా ఫ్లాప్ లను చవిచూస్తూ ఉన్నారు. జైలర్ సినిమాతో ఒక్కసారిగా పలు రికార్డులను తిరగ రాయడమే కాకుండా పెను సంచలనాలను సృష్టించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 10వ తేదీన ఈ సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చివరిలో తన కన్న కొడుకు తప్పు చేసిన వదలకుండా రజనీకాంత్ కాల్చి చంపేయడం జరుగుతుంది.

అయితే డైరెక్టర్ నెల్సన్ ఎన్నో ఇంటర్వ్యూలలో జైలర్ సినిమా సీక్వెల్ ఉంటుందని చెప్పడంతో ఇప్పుడు తెరపైకి ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. జైలర్ తర్వాత నెల్సన్ ఒక తెలుగు హీరోతో సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపించాయి అయితే అది వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు వెంటనే జైలర్-2 సినిమాని సెక్స్ మీదికి తీసుకు వెళ్లే విధంగా పనులు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకుగాను నెల్సన్ దిలీప్ కుమార్ కు సన్ పిక్చర్స్ రూ .50 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.