స్కంద మూవీ ఫుల్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

అఖండ వంటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆ తర్వాత రామ్ తో కలిసి స్కంద సినిమాని తెరకెక్కించారు.. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్ ట్రైలర్స్ ఈ సినిమా హైపుని భారీగా పెంచేసాయి ఇప్పటికి ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడడం జరిగింది.

Skanda (2023) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

ఎట్టకేలకు ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని సైతం తెలియజేయడం జరిగింది. చాలా సినిమాలు ఓవర్సీస్ ఏరియాలలో ముందుగానే విడుదలవుతూ ఉంటాయి. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇతర దేశాలలో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు పడడం జరుగుతాయి. అయితే స్కంద సినిమాకి మాత్రం ఓవర్సీస్లో ఇలా జరగలేదు. ఇండియాలో ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడే విదేశాలలో కూడా ఈ సినిమా పడేలా ప్లాన్ చేశారు చిత్ర బృందం.

ట్విట్టర్లో షేర్ చేసిన ప్రకారం ఈ సినిమా లో కథబలం చాలా తక్కువగా ఉన్న రామ్ పోతినేని మాస్ ఎనర్జీటీతో ఈ సినిమాని మెప్పించారని తెలుస్తోంది. ఎక్కువగా మాస్ ఆడియన్స్ కి నచ్చుతుందని పలువురు నెట్టిజెన్స్ తెలుపుతున్నారు. ఇందులో రామ్ ఫైట్ సన్నివేశాలు థమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అయిందని సమాచారం. ఫస్ట్ అఫ్ కొంతమేరకు యావరేజ్ గా ఉన్న ఫైనల్లీ ఈ సినిమా బాగుందని అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. రామ్ ఫాన్స్ మాత్రం ఎక్కడ నిరుత్సాహపడలేదని తెలుస్తోంది శిరిడీల తన అందంతో డాన్స్ తో మరింత ఆకట్టుకుంది. ఓవరాల్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మరి మొదటి రోజు ఎలాంటి రికార్డును బ్రేక్ చేస్తారో చూడాలి.