SSMB 29 మూవీ పై వస్తున్న ఆ న్యూస్ వాస్తవం కాదా.. ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో గుంటూరు కారం సినిమాలో న‌టిస్తున్నాడు. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని హారిక హాసన్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు సూర్యదేవర రాధాకృష్ణ. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్స్ వేగంగా జరుపుకుంటుంది. ఈ మూవీ రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకి గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఇక ఈ మూవీ త‌ర్వాత‌ పాన్ ఇండియా డైరెక్టర్ దర్శక ధీరుడు రాజమౌళితో తన 29వ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మ‌హేష్‌. భారీ పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ గా ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే తన కెరీర్‌లో 29వ మూవీని యువ దర్శకుడు అనిల్ రావిపూడి తో సూపర్ స్టార్ మహేష్ చేయబోతున్నాడని.. అలానే దానికి అనిల్ సుంకర ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆ న్యూస్ లో ఏ మాత్రం నిజం లేదట. ముందుగా ఫిక్స్‌ అయిన విధంగానే SSMB28 మూవీని పక్కాగా రాజమౌళి తోనే చేయబోతున్నాడట మహేష్. ఆ తర్వాతనే మిగతా దర్శకులతో మహేష్ సినిమాలు చేస్తాడని తెలుస్తుంది. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఏడాది ప్రారంభంలో రావ‌చ్చు.