చంద్రముఖి సినిమా రివ్యూ.. సినిమా చూస్తే నిద్ర పోలేరట..!!

రాఘవ లారెన్స్ హీరోగా ఈ వాసు దర్శకత్వంలో దాదాపుగా 17 ఏళ్ల తర్వాత చంద్రముఖి సినిమా సీక్వెల్ ని తెరకెక్కించారు. ఇందులో కంగాన రనౌత్ చంద్రముఖి పాత్రలు నటించింది. ఈ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. గతంలో విడుదలైన చంద్రముఖి సినిమాలో జ్యోతిక చంద్రముఖిగా నటించిన రజనీకాంత్ హీరోగా నటించడం జరిగింది.ఈ సినిమా అప్పట్లోనే సూపర్ హిట్టుగా నటించింది. ఇప్పుడు చంద్రముఖి సీక్వెల్ ఈ రోజున చాలా గ్రాండ్ గా విడుదల అయ్యింది.

Chandramukhi 2' trailer: Kangana Ranaut, Raghava Lawrence in a 'Chandramukhi  Vs Vettaiyan' rematch? - The Hindu

చంద్రముఖి-2 నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షో టాక్ మొదలయ్యింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల సైతం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. చంద్రముఖి సినిమాకి దర్శకత్వం వహించిన పి వాసు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని పాత్రలను వాసు చాలా చక్కగా తెరకెక్కించారని చిత్ర బృందం ఇంటర్వ్యూలలో తెలియజేయడం జరిగింది.

రివ్యూల విషయానికి వస్తే చంద్రముఖి సినిమా చూస్తే కొద్ది రోజులపాటు నిద్ర పట్టదని తెలుపుతున్నారు ఆడియన్స్. కీరవాణి కూడా ఈ సినిమా అంతలా భయపెడుతోందంటూ సోషల్ మీడియాలో కీరవాణి రాసుకురావడం జరిగింది. చంద్రముఖి-2 సినిమా చూశాను చాలా చక్కగా తెరకెక్కించారు.ఇందులోని సన్నివేశాలు కూడా తనకు నిద్ర పట్టనివ్వడం లేదంటూ తెలిపారు.

భారీ బడ్జెట్ తో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో కూడా విడుదలయ్యింది. అయితే ఈ సినిమా రివ్యూలను బట్టి చూస్తే ఈ సినిమా యావరేజ్ టాక్ తో వస్తోంది. రాఘవ లారెన్స్ నటన మెప్పించినట్టుగా తెలుస్తోంది.

ఆడియన్స్ అభిప్రాయం ప్రకారం మొదటి భాగం యావరేజ్ అని సెకండాఫ్ డీసెంట్గా సాగిపోతోందని తెలుస్తోంది. మ్యూజిక్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు పర్వాలేదని ఓవరాల్ గా ఈ సినిమా యావరేజ్ టాక్ అని ప్రేక్షకులు తెలుపుతున్నారు. మరి కంగన రనౌత్ చంద్రముఖిగా మెప్పిస్తుందేమో చూడాలి మరి