VD 13 లేటెస్ట్ అప్డేట్.. మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల శివానిర్వాణ‌ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా లెవెల్‌లో భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్‌లో పాల్గొన్న విజయ్ దేవరకొండ తన అభిమానులలో వందమందికి లక్ష రూపాయలు ప్రైజ్ మనీ కూడా ఇచ్చాడు. ఇక దీంతో మరింత పాపులారిటీ దక్కించుకున్న విజయ్.. చాలా మంది ప్ర‌సంస‌లు కూడా ద‌క్కించుకున్నాడు.

ప్రస్తుతం పరశురామ్ తో లవ్ అండ్, ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా మరో మూవీని నటిస్తున్నాడు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లో 13వ సినిమాగా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. సీతారామమ్ బ్యూటి మృణాల్‌ ఠాగూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. తమ మూవీని రానున్న సంక్రాంతి బారిలో నిలుపుతున్నట్లు తాజాగా సినిమా మేకర్స్ ఆఫీష‌య‌ల్‌ అనౌన్స్మెంట్ ఇచ్చారు.

ఇక‌ ఈ మూవీకి ఫ్యామిలీ స్టార్ అని టైటిల్ అనుకుంటున్నారట మూవీ టీం. అలానే మూవీ ని జనవరి 14న ప్రేక్షకు ముందుకు రిలీజ్ చేయడానికి మేకర్ ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. కాగా ఇంకా ఈ డేట్ పై అఫీషియల్ ప్రకటన రాలేదు. గతంలో విజయ – ప‌రుశురామ్ కాంబోలో వచ్చిన గీత గోవిందం భారీ సక్సెస్ అందుకుంది. దీంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో చూడాలి.