యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నవీన్ కీలకపాత్రలో నటించిన మూవీ మ్యాడ్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో రూపొందింది. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో రామ్ నితిన్, సంతోష్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి, అవంతిక, సునీల్ కుమార్, గోపిక ఉద్యాన్ పలువురు కీలక పాత్రలో నటించారు. ఈ నేపథ్యంలో మాడ్ మూవీ గ్యాంగ్ ను పరిచయం చేస్తూ మంగళవారం మూవీ పార్టనర్స్ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ ఇవెంట్‌లో అతిథిగా హాజరైన దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ తను తీసిన జాతి రత్నాలు కంటే ఈ సినిమాలోని మరింత ఎంటర్టైన్మెంట్ ఉంటుందని వివరించాడు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటుందని.. మ్యాడ్ క్యారెక్టర్స్ పంచే కామెడీ కడుపుబా నివిస్తుందని చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారని చెప్పినా ఈయన జాతి రత్నాలు కంటే ఒక్కసారి అయినా తక్కువ నవ్వానని ఎవరైనా చెప్తే టికెట్ డబ్బులు వెనక్కి ఇచేస్తానంటూ చెప్పుకొచ్చాడు.
ఈ సినిమా మీద అంత నమ్మకం ఉంది అంటూ వివరించాడు. లాజిక్, ట్విస్టులు ఏమీ లేకుండా నవ్వడమే లక్ష్యంగా ఈ సినిమాను రూపొందించామంటూ ప్రొడ్యూసర్ నాగ వంశీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మూవీ పై హైప్ పెరిగింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత ఆ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందో..? చూడాలి.