నాగార్జున ‘ నా సామి రంగా ‘ లో అతడు హీరోనా..? విలనా..?

అక్కినేని నాగార్జున హీరోగా చాలాకాలం తర్వాత కొత్త సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతున్నాడు. నా సామిరంగా అనే సినిమాలో ఈయన నటిస్తున్నాడు. కొరియోగ్రాఫర్ విజయ బిన్నీ దర్శకుడుగా ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఓ పిరియాడికల్ డ్రామా అని సమాచారం.

1969 – 1985 మధ్యకాలంలో జరిగే కథగా ఈ సినిమాను తరికెక్కిస్తున్నారట. నాగార్జునను ఢీకొట్టే పాత్ర కూడా ఇందులో గట్టి పోటీ ఇస్తుందట. కానీ అది సెకండ్ హీరో పాత్ర లేదా విలన్ పాత్ర అనేది ఇంకా వేచి చూడాలి. వీరిద్దరి మధ్య సాగే పోరాటమే ఈ సినిమా కదా అని నాగార్జున కెరీర్‌లోనే ఇప్పటివరకు ఇలాంటి మాస్ మూవీ చేయలేదని సినీవర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది.

ప్రసన్న స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్న ఈ సినిమాకు చిట్టూరి శ్రీనివాస్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివ‌రాలు తెలియాలంటే వేచి చూడక తప్పదు. ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే సినిమా పై మంచి హైప్ తీసుకువచ్చాడు నాగార్జున. ఇక ఈ సినిమా రిలీజై ప్రేక్షకులు వద్ద ఎటువంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.