‘ జవాన్ ‘ మూవీ బంపర్ ఆఫర్.. ఆ మూడు రోజులు ఒక టికెట్‌ కొంటే మరొకటి ఫ్రీ..!!

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ ఇటీవల రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్లు సొంతం చేసుకుని సరికొత్త రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జవాన్ సినిమా విషయంలో అభిమానులకు శుభవార్త వినిపించాడు షారుక్ ఖాన్. ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితంగా పొందవచ్చని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గురు, శుక్ర, శనివారం మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేస్తూ పోస్ట్ పెట్టారు. బుక్ మై షో, పేటీఎం మూవీస్, వివిఆర్ అయినాక్స్ వెబ్సైట్లు యాప్ల ద్వారా చేసే ఆన్లైన్ బుకింగ్ కి ఇది పరిమితమైందని షరతులు వర్తిస్తాయని పేర్కొన్నారు.

అభిమానులు కోరిక మేరకు కొన్ని గంటల్లోనే షారుక్ ఖాన్ నిర్ణయం తీసుకోవడం విశేషం. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా షారుక్‌ తన ఫాన్స్ తో చిట్ చాట్ చేశాడు. ఈ సినిమా టికెట్ల కోసం ఇప్పటికే రూ.4000 ఖర్చు అయిందని.. నా గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ వెళ్ళమంటుందని వెళ్ళనా.. అని ఓ అభిమాని అడగ్గా వెళ్లండి డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుందని షారుక్‌ వివరించాడు. సార్ ఆర్థిక సమస్యల కారణంగా జవాన్ సినిమాని ఒకసారి చూసా షారుక్ అభిమాని అయ్యుండి రెండుసార్లు సినిమా చూడాలి కాని ఒకసారి చూడడం ఏంటి అంటూ అందరూ హేళ‌న‌ చేస్తున్నారు ప్రస్తుతానికి చూడలేను సార్ అని మరో అభిమాని సారి చెప్పాడు.

మీరు బాధపడకండి అంతా మంచి జరుగుతుందని షారుక్ రిప్లై ఇచ్చాడు. షారుక్ హీరోగా కోలీవుడ్ దర్శకుడు డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా రెడ్ చిల్లిస్ ఎంటర్టైన్మెంట్ పథకం పై షారుక్‌ సతీమణి గౌరీఖాన్ ప్రొడ్యూసర్ గా, మరో ప్రొడ్యూసర్ గా గౌరవ్ వర్మ ఉన్నారు. అయితే ఇక ఈ సినిమాతో ఈ ఏడాదిలో 2 రూ. వెయ్యి కోట్ల కలెక్షన్లు వసూలు సాధించిన సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఏకైక భార‌తీయ న‌టుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు షారుక్.