మనకు తెలిసిందే నేడు ఏఎన్నార్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో పలువురు రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరై ఏఎన్ఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. మరి ముఖ్యంగా మోహన్ బాబు, బ్రహ్మానందం ,మహేష్ బాబు , రామ్ చరణ్ , హీరో నాని . మంచు విష్ణు . రాజమౌళి ఇతర తారలు భారీ సంఖ్యలో హాజరై వాళ్లకున్న ప్రేమను ప్రూవ్ చేసుకున్నారు .
ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు వెంకయ్య నాయుడు. కాగ ఈ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చిన వెంకయ్య నాయుడు ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి.. ఈ సందర్భంగా అక్కినేని ఫ్యామిలీతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ గురించి చెప్పుకొచ్చారు. అయితే ఇదే క్రమంలో స్టేజీ పైకి ఎక్కిన నాగ చైతన్య తన స్పీచ్ తో అదరకొట్టేశారు.
అక్కినేని మనవడుగా నాగచైతన్య అదరగొట్టేశారు . ఇన్నాళ్లు నాగచైతన్యకు మాట్లాడటం రాదని.. స్పీచ్ ఇవ్వడం అసలు రాదని.. ఎగతాళి చేసిన వాళ్ళకి ఇచ్చి పడేసాడు . ఒక్క దెబ్బతో నాగచైతన్య టాప్ రేంజ్ లో ట్రెండ్ అయిపోతున్నాడు. మరి ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా పుట్టడం నా అదృష్టమని చాలా ఎమోషనల్ గా కామెంట్స్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో నాగచైతన్య లో ఉన్న మరో యాంగిల్ బయటపడింది అంటూ అక్కినేని నాగచైతన్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!