ఆ విషయంలో ఈ కమెడియన్స్‌కు సాటి రారెవ్వరూ..

సాధారణంగా మనిషి అన్న తరువాత ఏదో ఒక అలవాటు ఉంటుంది. అది మంచిధైనా సరే చెడ్డధైనా సరే. ఇక సినిమా సెలబ్రిటిలు అయితే కొన్నిసార్లు వల్ల అలవాట్లను, పద్ధతులను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక కొంతమందేమో నలుగురిలోకి వెళ్లి మాట్లాడకుండా ముడుచుకొని కూర్చుంటే ఎదుటివాళ్ళు అవహేళన చేస్తారనే ఉదేశ్యం తో మద్యం తాగి దానికి బానిసలూ అవుతుంట్టారు. అయితే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్స్ అయిన అలీ, బ్రహ్మానందం మాత్రం ఇప్పటివరకు ఒక చుక్క మందు కూడా తాగలేదట.

ముందుగా బ్రహ్మానందం గురించి మాట్లాడుకుంటే తెలుగు సినీ పరిశ్రమలో లెజెండ్రి కమెడియన్ గా పేరు తెచ్చుకొని ఎన్నో సినిమా లో నటించి తన కామెడీ తో ఎంతో మందిని కడుపుబ్బ నవ్వించాడు. అయితే ఏంతోకాలం నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతున్న బ్రహ్మానందం ఇప్పటివరకు ఒక చుక్క మందు ముట్టలేదట. ఇండస్ట్రీ లో మంచి మంచి అవకాశాలు వస్తున్నప్పుడు మద్యం తాగి జీవితాన్ని నాశనం చేసుకోడం ఎందుకు అనే ఉదేశ్యంతో మధ్యాన్ని దూరంగా ఉంచారట ఆయన.

ఇక భ్రహ్మానందం తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ కమెడియన్ ఎవరు అంటే అలీ అనే చెప్పాలి. ఎంత ఎదిగిన కూడా అలీ ఇప్పటివరకు మద్యం తాగలేదని సమాచారం. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన అలీ ‘ తమ మతంలో మందు అనేది నిశిద్ధం ‘ అని ఆయన తెలిపారు. ఇలా మరికొంతమంది సినీ సెలెబ్రేటీలు కూడా మధ్యానికి దూరంగా ఉంది వారి హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.