హీరోయిన్ మృణాల్‌కు రీచీక‌టా… ఇలా బ‌య‌ట ప‌డిందిగా…!

” సీతారామం ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్… మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన నటన, అందంతో ప్రేక్షకులని కట్టిపడేసింది. ఈ బ్యూటీ అప్కమింగ్ ఫిల్మ్ ” ఆంఖ్ మిచీల్లీ ” ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఇందులో రేచీకటి కలిగిన అమ్మాయిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ… నవ్వుల పువ్వులు పూయించింది. ఇదే విషయాన్ని దాచిపెట్టి తన తండ్రి వరుడి కోసం వెతకడం… ఈ క్రమంలో ఎదురయ్యే పరిణామాలు పూర్తిగా ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించనున్నాయి.

ఉమేశ్ శుక్లా దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్టును సోని పిక్చర్స్, మెర్రీగో రౌండ్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా….పరేశ్ రావల్ , అభిమన్యు, శర్మన్ జోషి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. యే చీటింగ్ నహి…. సెట్టింగ్ హై… ది మోస్ట్ ఐకానిక్ వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్… అంటూ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేసిన మేకర్స్…ఫన్ఫుల్ రైడ్ కు హామీ ఇస్తున్నారు.