నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా…. అయితే డేంజర్ జోన్లో పడినట్లే….!!

చాలామంది ఉదయం నిద్ర లేవగానే స్మార్ట్ఫోన్ చూస్తారు. మెసేజ్లు, ఈ మెయిల్స్ చెక్ చేసుకుంటూ చాలాసేపు బెడ్ పైనే గడిపేస్తారు. ఇది అసలు మంచి పద్ధతి కాదు. ఉదయం నిద్ర లేవగానే చేసే పనులు చాలా ఉంటాయి. వాటిని కాదని ఫోన్తో గడపడం ఆరోగ్యానికి మంచిది కాదు. వ్యాయామం, యోగ సమయంలో ఫోన్ తో గడపడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం నిద్ర లేచిన వెంటనే మొబైల్ ఫోన్ చూడడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రశాంతమైన జీవనశైలికి ఆంతరాయం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. నిద్ర లేవగానే ఫోన్ చూడడం వల్ల రోజంతా అలసటగా, ఆకలి వేయకపోవడం, అనారోగ్య సమస్యలు దరిచేరతాయి.

ఉదయాన్నే ఫోన్ లో వివిధ సమాచారం కోసం వెతకడం, వాట్సాప్ లో మెసేజ్ లు చెక్ చేయడం వల్ల మెదడు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ప్రభావం మానసిక స్థితిపై కంటే ఆరోగ్యం పై ఎక్కువ ప్రభావితం చూపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు మనసులో చెడు ఆలోచనలు, చెడు బుద్ధి లాంటి సమస్యలు కూడా వస్తాయి. అందువల్ల ఉదయాన్నే లేవగానే ఫోన్ చూడక పోవడమే ఉత్తమం.