టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో తెర్కెక్కిన పుష్ప 1 సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కబోతుంది. పుష్ప 1 సినిమా ఎలాంటి క్రేజీ హిట్ ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించింది . కాగా రీసెంట్ గానే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని సైతం ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కి వరించింది.
దీంతో సోషల్ మీడియాలో పుష్ప2 సినిమా హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. అయితే ఇదే మూమెంట్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తూ మూవీ మేకర్స్ పుష్ప2 సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆగస్టు 15 2024 ఈ సినిమాని గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియాలో రిలీజ్ చేయబోతున్నాం అంటూ చెప్పుకు వచ్చారు . అయితే ఎందుకు పుష్ప2 సినిమాని ఆగస్టు 15న రిలీజ్ కన్ఫామ్ చేశారు సుకుమార్ అనడానికి పెద్ద లాజికే ఉంది . ఆగస్టు 15 గురువారం ఆరోజు సెలవు ..దీని తర్వాత శుక్ర-శని-ఆది లాంగ్ వీకెండ్ కలిసొచ్చేస్తుంది .
ఇలా జనరల్ గా ఇలా వరుసగా హాలిడేస్ వస్తే సినిమా కలెక్షన్స్ బాగా ఊపందుకుంటాయి. అయితే ఆ తర్వాత సోమవారం రక్షాబంధన్ వచ్చింది . ఇలా ఐదు రోజుల లాంగ్ వీకెండ్ ఉండడంతో ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది . అంతేకాదు ఆ తర్వాత 23 నుంచి 25 దాకా లాంగ్ వీకెండ్ వస్తుంది .. 26 జన్మాష్టమి ఇలా వరుస పెట్టి లీవ్స్ ఉన్న కారణంగా అదే టైంలో పుష్ప2 సినిమా రిలీజ్ అయితే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ చరిత్రను తిరగ రాస్తాడు పుష్ప గాడు అని సుకుమార్ తన క్రేజీ లెక్కలతో కరెక్ట్ టైం లో పుష్ప 2 రిలీజ్ డేట్ ని సెట్ చేశారు . దీంతో సుకుమార్ నిజంగానే లెక్కలు మాస్టర్ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ అంటూ జనాలు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. 1000 కోట్లు కన్ఫామ్ ఈసారి రాసి పెట్టుకోండి అంటూ ఫ్యాన్స్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!