భగవంత్ కేసరి సర్ప్రైజ్ వీడియో.. మాస్ ఫాన్స్ కి పూనకాలే..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. ఇందులో కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీల కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాదు సినిమా పై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఇక అక్టోబర్ 19వ తేదీన విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్ర నిర్వహకులు షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఒక ప్రచార వీడియోని విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రీ లీల బాలకృష్ణ కుమార్తెగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమా పూర్తవుతుందా? లేదా? అక్టోబర్ 19న విడుదలవుతుందా? అనే అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుండగా.. ఈ వీడియో వాటన్నింటికీ సమాధానం చెబుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా దసరాకి టార్గెట్ గా పెట్టుకున్న బాలయ్య ఈ సినిమాతో దసరా పండుగ కి తమ సినిమాను విడుదల చేసి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యారు. అటు ఎన్ని రాజకీయ ఒత్తిడిలు ఉన్నా ..బాలకృష్ణ అనుకున్న సమయానికే ఈ సినిమా విడుదల చేయాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే.

డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య లోని ఇంకో కోణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారట. బాలకృష్ణ యాస కూడా వేరేలా ఉండబోతుందని సమాచారం.ఇకపోతే ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నెగిటివ్ రోల్ పోషిస్తూ ఉండగా.. నిర్మాతలుగా హరీష్ పెద్ది , సాహు గారపాటి వ్యవహరిస్తున్నారు. ఇక ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే తాజాగా విడుదల చేసిన సర్ప్రైజ్ వీడియోలో బాలకృష్ణ డైలాగ్ ..”కలిసి మాట్లాడతా అన్నా కదా అంతలోనే మందిని పంపాలా” అనే డైలాగ్ వీడియోకి చాలా హైలెట్ గా మారుతుంది .అయితే ఇది ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేది సినిమా చూస్తేనే తెలుస్తుందని చెప్పవచ్చు.