సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలు సెట్ అవ్వడానికి చాలా టైం పడుతూ ఉంటాయి. వన్స్ ఆ క్రేజీ కాంబో సెట్ అయిందా..? హిట్ కొట్టిందా..? డైరెక్టర్ ఆ కాంబోను పదే పదే రిపీట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. తాజాగా అలాంటి ఒక క్రేజీ కాంబో మరోసారి రిపీట్ అవుతూ ఉండడం అభిమానులకు తెగ ఆనందాన్నిస్తుంది . ఆ క్రేజీ కాంబో మరి ఎవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత ..వీళ్లిద్దరూ కలిసి నటిస్తే చూడాలి అన్ని అభిమానులు గత కొంతకాలంగా వెయిట్ చేస్తూనే ఉన్నారు.
దాదాపు అర్జున్ రెడ్డి సినిమా నుంచి వీళ్ళ కాంబో సెట్ అయితే బాగుండు అని ఆశపడుతున్నారు . ఫైనల్లి ఇన్నాళ్లకు వాళ్లకాంబో సెట్ అయింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించి మెప్పించి అభిమానులను ఆకట్టుకున్నాడు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . కాగా ఈ క్రమంలోనే మరోసారి తెరపై విజయ్ దేవరకొండ సమంతను చూపించడానికి దర్శకులు ఆశ పడుతున్నారు.
కాగా గౌతం తిన్నూరు దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయిపోయాయి. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది . అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్గా సమంతను చూస్ చేసుకున్నారట మేకర్స్. ఖుషి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే సమంత కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పి మరి అమెరికా వాళ్లిన విషయం తెలిసిందే . అయితే విజయ్ – సమంత రొమాన్స్ కి జనాలు ఫిదా అవ్వడంతో.. ఆమె తన డెసిషన్ ని బ్యాక్ తీసుకొని మరి ఈ సినిమాలో నటించడానికి ఓకే చేసిందట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం తెరపై మరోసారి సమంత -విజయ్ రొమాన్స్ మనం చూడబోతున్నట్లే..!!